Andhra Pradesh : ఏపీకి రూ.446 కోట్లు విడుదల

ఏపీకి 15వ ఆర్థిక సంఘం గ్రాంటు రూ.446 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 2024-25కుగానూ రెండో వాయిదా కింద రూ.421 కోట్లు, ఒకటో వాయిదా కింద పెండింగ్‌లో ఉన్న రూ.25 కోట్లను అందించింది. 13,097 గ్రామ పంచాయతీలు, 650 బ్లాక్ పంచాయతీలకు ఈ నిధులకు కేటాయించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖలలో కూటమి ప్రభుత్వం ఈ నిధులను ఖర్చు చేయనుంది.రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో పొందు పరిచిన కొన్ని అంశాల ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం గ్రాంట్స్ విడుదల చేయనుంది. వీటిలో టైడ్‌గ్రాంట్స్‌ని ఓడీఎఫ్, పారిశుద్ధ్యం, నీటి యాజమాన్యం, వాననీటి సంరక్షణ, మురికినీటి రీసైక్లింగ్, ఇళ్ల నుంచి వెలువడిన వ్యర్థాల శుద్ధికి వినియోగించాల్సి ఉంటుంది. అన్‌టైడ్ గ్రాంట్స్‌ను పారిశుద్ధ్యం, విద్య, వ్యవసాయం, గ్రామాల్లో గృహ నిర్మాణం లాంటి పనుల కోసం వినియోగించాలి. పంచాయతీల్లో స్థానిక అవసరాల కోసం ఈ నిధులు ఉపయోగించాలి. అంతేకానీ ప్రభుత్వం వీటిని ఉద్యోగుల జీతభత్యాలు, ప్రభుత్వ ఇతర ఖర్చుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ దారి మళ్లించకూడదు. తాజాగా ఇచ్చిన రెండో విడత గ్రాంట్ నిధులు పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖలకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com