Vijayawada : వరద ప్రాంతాల్లో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే చేశారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతం, క్యాచ్మెంట్ ఏరియా, పాల ఫ్యాక్టరీ, కండ్రిక, సింగ్ నగర్ సహా ఇతర ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని చౌహాన్‌కు మంత్రి లోకేశ్ వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. కాసేపట్లో వరద నష్టంపై అధికారులతో చౌహాన్ సమీక్షించనున్నారు. ఇక, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించనున్నారు.. అనంతరం జక్కంపూడి కాలనీ మిల్క్ ఫ్యాక్టర్టీ ప్రాంతాన్ని ఎన్.డీ.ఆర్.ఎఫ్ బోట్లో పరిశీలించనున్నారు.. విజయవాడ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుని, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను వీక్షిస్తారు.. ఇక, వరద నష్టంపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కేంద్రమంత్రి చౌహాన్ సమీక్ష నిర్వహించనున్నారు. జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించి, నివేదికలు అందజేయనున్నారు వివిధ శాఖల ఉన్నతాధికారులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com