మహనీయుల త్యాగాలకు అర్థం ఏముంది?: చంద్రబాబు

మహనీయుల త్యాగాలకు అర్థం ఏముంది?: చంద్రబాబు
Chandra babu: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Chandra babu: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. వేడుకల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు.

ప్రజలు నిర్బంధాలు, అణచిత నుంచి బయటపడి.. స్వేచ్ఛగా ఎదగడం కోసమే నాయకులు స్వాతంత్ర్యం కోసం పోరాడారని చంద్రబాబు అన్నారు. ఇవాళ ఏపీలో ప్రజలకు, వారి భావాలకు, ఎదుగుదలకు.. అడుగడుగునా సంకేళ్లు పడుతుంటే ఆ మహనీయుల త్యాగాలకు అర్థం ఏముందని ప్రశ్నించారు. మన సంపదను మన పాలకులే దోచుకుంటుంటే.. దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలను అణచివేస్తుంటే ఏం చేయాలన్నారు చంద్రబాబు. జాతీయోధ్యమ స్ఫూర్తితో పోరాడి మన సమాజాన్ని రక్షించుకోవాలని.. పాలకుల దుర్మార్గాలను ఒక్కటిగా ఎదిరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇదే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు.


Tags

Read MoreRead Less
Next Story