Chandra babu : రైతులను ఆదుకోవడంలో జగన్‌ రెడ్డి విఫలం : చంద్రబాబు

Chandra babu : రైతులను ఆదుకోవడంలో జగన్‌ రెడ్డి విఫలం : చంద్రబాబు
X
Chandra babu : కరోనా సమయంలో రైతులను ఆదుకోవడంలో జగన్‌ రెడ్డి విఫలమయ్యారని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandra babu : కరోనా సమయంలో రైతులను ఆదుకోవడంలో జగన్‌ రెడ్డి విఫలమయ్యారని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతు ఉత్పత్తుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న ఆయన.. మోటార్లకు మీటర్లు బిగించే పథకం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం నదీ జలాల హక్కుల్ని తాకట్టు పెట్టి.. రైతు లోకాన్ని దగా చేసింది విమర్శించారు. రాష్ట్రంలో ఏ పంటకూ మద్దతు ధర దక్కడం లేదని.. రైతు బంధు కింద 13వేల 500 రూపాయలు ఇస్తామని చెప్పి.. కేవలం 7వేల 500 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను అదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని.. సాగునీటి ప్రాజెక్టులకు బ్జెట్‌ పెంచాలన్నారు.

Tags

Next Story