Chandra Babu: అశోక్ బాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన చంద్రబాబు

Chandra babu: ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. జగన్ సర్కార్ తీరుపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. సర్వీస్ మేటర్స్‌లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమోచ్చిందంటూ నిలదీశారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వ చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లించుకుంటుందంటూ హెచ్చరించారు.
అర్ధరాత్రి అశోక్ బాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం అశోక్ బాబు పోరాడుతున్నందునే కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. పార్టీ అశోక్ బాబుకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అబద్ధపు పునాదుల మీద అధికారాన్ని చేపట్టిన జగన్...అరాచక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు. వైసీపీ వైఫల్యాలు, తప్పుల్ని ప్రశ్నించిన టీడీపీ నేతలను అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. అర్ధరాత్రి దొంగల్లా వచ్చి అరెస్టు చేయడమేంటని నిలదీశారు. గతంలో అశోక్‌బాబుపై వచ్చిన ఆరోపణల్లో ఆయన ప్రమేయం లేదని విచారణలో తేలినా...మల్లి కేసు పెట్టడం జగన్ అరాచక పాలనకు అద్దం పడుతుందన్నారు. జగన్ రెడ్డి ఇకనైనా తీరు మార్చుకుని పాలన సాగించాలని...లేకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com