Cm chandra babu: గత ప్రభుత్వంలో నాకంటే బాధితుడు ఎవరున్నారు?

బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో జరిపిన మాటలలో పలు వ్యాఖ్యలు చేసారు సీఎం చంద్రబాబు. ఎవరిపైనా రాజకీయంగా నిలదీసే స్వభావం లేదని, అలా చేసిన వారెవరూ తప్పించుకోలేరని, తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా తెలిపారు. గత ఐదేళ్లలో అందరికంటే ఎక్కువగా బాధపడ్డది నేనేనని.. గత ప్రభుత్వం నన్ను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారని., జైలులో నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ప్రచారం కూడా జరిగిందని మాట్లాడారు. ఈ సమయంలో జైలు మీదుగా డ్రోన్లు కూడా ఎగరేశారని., జైలులో నా గదిలో నిఘా కెమెరాలు పెట్టారని., వాటిని చూసి నేనే తొలిగించామన్నాని చెప్పనట్లు తెలిపాడు. జైలులో ఉన్న సమయంలో కనీసం వేడినీళ్లు కూడా ఇవ్వలేదని., నన్ను చిత్రహింసలకు గురిచేయడాని, ఎప్పుడు నాకు చల్లటి నీరు ఇచ్చేవారని.. దోమలు కుడితే… కనీసం దోమతెర కూడా ఇవ్వలేదని వాపోయారు.
బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ప్రెస్‌మీట్ ముగిశాక... విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఐదేళ్ల వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు లేవన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో ఉంది కదా? అని విలేకరులు ప్రస్తావించగా... ఆయన పైవిధంగా స్పందించారు. మద్యం దుకాణాల లైసెన్సుల వ్యవహారంలో పార్టీ ఎమ్మెల్యేల జోక్యాన్ని సహించబోనని, బెదిరింపులకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన స్పష్టంచేశారు. ‘పొలిటికల్ గవర్నెన్స్’ అంటే ప్రజలకు, కార్యకర్తలకు మరింతగా అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తప్ప, అన్నింటిలోనూ తలదూర్చడం, కర్ర పెత్తనం చేయడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదని ఆయన పేర్కొన్నారు. పోటీ ఉండాలనే మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పొడిగించామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com