Chandra Babu : అమ్మనే గెంటేసినవాడు ప్రజలకు ఏం చేస్తాడు : చంద్రబాబు

Chandra Babu : అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో.. పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై ముఖ్యనేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. జగన్ సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అమ్మను గెంటేసినవాడు ప్రజలకు ఏం చేస్తాడని ప్రశ్నించారు.
జగన్‌రెడ్డిది విశ్వసనీయత కాదు.. విషపునీయత అన్నారు. మద్యనిషేధం, సీపీఎస్, అమరావతిపై.. మాట తప్పి మడపతిప్పడం విశ్వసనీయతా? అని ప్రశ్నించారు. చిన్నాన్నపై గొడ్డలివేటు వేసిన..... నేరస్థుల్ని కాపాడటం విశ్వసనీయతా? అంటూ మండిపడ్డారు. అమ్మను గెంటేసినవాడు... ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు ఏం చేస్తాడని ప్రశ్నించారు.
టీడీపీ అధికారంలోకి వస్తే... సంక్షేమపథకాలు నిలిపేస్తారని అపద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు. ఓటమి భయంతోనే జగన్ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తక్షణమే పాఠశాలల విలీనం ఉపసంహరించుకోవాలని, 51వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మోటార్లకు మీటర్లు కేంద్రం ఉపసంహరించుకుందన్న చంద్రబాబు... దీనిపై జగన్‌రెడ్డి తన వైఖరి రైతులకు చెప్పాలన్నారు.
మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ సంఘీభావం చెబుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమండ్ చేశారు. అమర్‌నాథ్ యాత్రలో ఏపీకి చెందిన 37మంది గల్లంతయ్యారని... వారిపట్ల జగన్‌రెడ్డి నిర్లక్ష్యం చూపించారన్నారు. ఇక పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. పులివెందులలోనే జగన్‌ను ఓడించేందుకు జనం ఎదురు చూస్తున్నారన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com