ఉత్తరాంధ్రలో బాబు రెండో రోజు పర్యటన

నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండోరోజు పర్యటించనున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా సాయంత్రం విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు జిల్లా సరిహద్దు చింతలపాలెం నుంచి విశాఖ అరకు రోడ్డులో స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
చంద్రబాబుకు మొదట చింతలపాలెం వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం చెబుతాయి. అనంతరం అక్కడి నుంచి చంద్రబాబు శిరికి గ్రీన్ సిటీకి వెళ్తారు. అక్కడ భీమసింగి చెరకు రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. అనంతరం కొత్తూరు శివాలయం నుంచి రోడ్‌షో ప్రారంభిస్తారు. దేవిబొమ్మ కూడలిలో రోడ్‌షో ముగిసిన వెంటనే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం శిరికి గ్రీన్‌సిటీలోనే రాత్రి బస చేస్తారు. రేపు శిరికి గ్రీన్‌సిటీలోనే కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయ విద్యార్థులు, దాసరి సామాజికవర్గంతో చంద్రబాబు సమావేశమవుతారు.
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా మొదటిరోజు జగన్ పాలన తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ పనైపోయింది.. వైసీపీ పనైపోయిందని ఎద్దేవా చేశారు. వచ్చేవి మామూలు ఎన్నికలు కాదని.. కురుక్షేత్రమన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఖతం.. ఎవరూ గెలవరని అన్నారు. 175 కాదు.. వైసీపీకి గుండు సున్నానే అని చెప్పారు. ధైర్యముంటే పులివెందులను గెల్చుకోవాలని జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com