చంద్రబాబు..కాన్వాయ్‌లోని ఓ కారులో సాంకేతిక లోపం

చంద్రబాబు..కాన్వాయ్‌లోని ఓ కారులో సాంకేతిక లోపం
టీడీపీ అధినేత చంద్రబాబు..కాన్వాయ్‌లోని ఓ కారులో సాంకేతిక లోపం తలెత్తింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా.. నార్కెట్‌పల్లి వద్ద కారు ఆగిపోయింది..

టీడీపీ అధినేత చంద్రబాబు..కాన్వాయ్‌లోని ఓ కారులో సాంకేతిక లోపం తలెత్తింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా.. నార్కెట్‌పల్లి వద్ద కారు ఆగిపోయింది. దీంతో 20నిముషాల పాటు.. చంద్రబాబు రహదారిపైనే నిలిచిపోయారు. మరో బుల్లెట్‌ ప్రూఫ్‌ వెహికల్‌లో హైదరాబాద్‌ వచ్చారు. ఐతే ప్రతి 20వేల కిలోమీటర్లకు ఒకసారి క్లచ్‌ ప్లేట్స్‌ మార్చాల్సి ఉండగా.. కాన్వాయ్‌ వెహికిల్స్‌ భద్రతకు సంబంధించిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రయాణించే ప్రధాన వాహనం 60వేల కిలోమీటర్లు తిరిగినా.. ఇప్పటికీ రిపేర్‌ చేయలేదు.

Tags

Read MoreRead Less
Next Story