Andhra Pradesh : ప్రజల మధ్య చంద్రబాబు.. ప్యాలెస్ లో జగన్..

Andhra Pradesh : ప్రజల మధ్య చంద్రబాబు.. ప్యాలెస్ లో జగన్..
X

ఏపీలో మొంథా తుఫాన్ బీభత్సం అంతా ఇంతా కాదు. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలం అవుతున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులకు ఊర్లు, పట్టణాలు అన్నీ నీటిలో మునిగిపోయాయి. చెట్లు విరిగాయి, స్తంభాలు కూలిపోయాయి. పంట నష్టం భారీగా జరిగింది. ఇలాంటి విపత్తుల విషయంలో అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు.. అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో అత్యంత సౌకర్యవంతంగా వసతులు కల్పించారు. రెస్క్యూటీమ్స్, ఎన్డీఆర్ ఎఫ్‌, ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా రెస్ట్ లేకుండా అన్ని ఏరియాలు తిరుగుతున్నారు.

పునరావాస కేంద్రాలకు స్వయంగా వెళ్లి అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తీర ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్ సర్వే చేశారు. పంట నష్టం వివరాలు తెలుసుకుని అధికారులకు కీలక ఆదేశాలు ఇస్తున్నారు. ప్రజల మధ్యే ఉంటూ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మరి ప్రధాన ప్రతిపక్షం మేమే అంటూ డబ్బా కొట్టుకునే మాజీ సీఎం జగన్ ఎక్కడికి వెళ్లారు. ఏపీకి ఇంత పెద్ద విపత్తు వస్తే కనీసం పట్టించుకోరా. బెంగుళూరు ప్యాలెస్ లో సేదదీరుతారా అంటున్నారు ప్రజలు. ప్రతిపక్ష నేతగా జగన్ కు ఆ మాత్రం బాధ్యత లేదా. ఈ టైమ్ లో కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రజలకు అండగా నిలబడరా. వైసీపీ నేతలను తుఫాన్ బాధితులకు అండగా నిలవాలని ఒక్క మాట కూడా చెప్పరా.

ఈ టైమ్ లో జగన్ ప్రజల మధ్య ఉంటూ వారికి అండగా నిలబడి ఉంటే ఆయనకు అంతో ఇంతో పేరొచ్చేది. కానీ జగన్ తన తీరు మార్చుకోలేదు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇంతే. జగన్ హయాంలో గులాబ్ తుఫాన్ వచ్చింది. అప్పుడు కూడా జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు. ఒక్క రివ్యూ కూడా పెట్టలేదు. కనీసం అధికారులను అలర్ట్ చేయలేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రజలను గాలికి వదిలేశారు. అప్పుడు ఏ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో మనం చూశాం. అంటే జగన్ సీఎంగా ఉన్నా, ప్రతిపక్ష హోదాలో ఉన్న ఒక్కటే అన్నమాట. కానీ చంద్రబాబు అలా కాదు. ఆయన సీఎంగా ఉన్నా, ప్రతిపక్ష హోదాలో ఉన్నా సరే ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటారు. వారిని కాపాడుకుంటూనే ఉంటారు. ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే ఛార్ధామ్ యాత్రికులను ప్రత్యేక ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చారు. మొన్న ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్థులను ప్రత్యేక ఏర్పాట్లతో తీసుకొచ్చారు. గులాబ్ తుఫాన్ సమయంలోనూ ఆయన ప్రజల మధ్యే ఉన్నారు. జగన్ కు, చంద్రబాబుకు తేడా అదే మరి.

Tags

Next Story