సబ్బం హరి మృతిపై చంద్రబాబు, లోకేష్ దిగ్భ్రాంతి..!

సబ్బం హరి మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సబ్బం హరి మృతి టీడీపీకి తీరని లోటు అని అన్నారు. విశాఖ మేయర్‌గా, ఎంపీగా సబ్బం హరి ప్రజలకు ఎనలేని సేవ చేశారని తెలిపారు. సబ్బం హరి మంచి వక్త అని గుర్తుచేసుకున్నారు. సబ్బం హరి కుటుంబ సభ్యులకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. 15 రోజులుగా చికిత్స పొందిన హరి.... త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్న సమయంలో... ఆయన మరణవార్త వినాల్సి రావడం బాధాకరమని అన్నారు.
సమస్యలపై పోరాడిన సబ్బం హరి.... ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సబ్బం హరి ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. నిస్వార్థ రాజకీయాలతో తన లాంటి వాళ్లకు మార్గర్శకులుగా నిలిచారని కొనియాడారు. సబ్బం హరి వంటి నేతను కోల్పోవడం దురదృష్టకరమన్న లోకేష్.... ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సమస్యలపై పోరాడే ప్రజా నాయకుడి సబ్బం హరి గుర్తింపు పొందారని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సబ్బం హరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com