CM Chandrababu : చంద్రబాబు ప్రకటించిన వరదసాయం.. ఫుల్ డీటెయిల్స్ ఇవే

CM Chandrababu : చంద్రబాబు ప్రకటించిన వరదసాయం.. ఫుల్ డీటెయిల్స్ ఇవే
X

విజయవాడను వణికించిన బుడమేరు వరద బాధితులకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయాన్ని ప్రకటించారు. మంగళ వారం రాత్రి వెలగపూడిలోని సీఎంఓలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీఎం చంద్రబాబు వరద సాయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడమేరు వరదల్లో అన్నిరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలను అన్నిరకాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టిందన్నారు.

ప్రధానంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే వరదల్లో భారీగా నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని అందివ్వబోతున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే మొదటి అంతస్తులో ఉండే వారికి రూ.10 వేలు, ఇళ్లలో నీళ్లు వచ్చిన బాధితులకు రూ.10వేలు వంతున ఆర్థికసాయం అందిస్తామన్నారు. అదేవిధంగా చిరు వ్యాపారులకు రూ.25 వేలు, వరదల్లో నష్టపోయిన ఎంఎస్ఎంఈలకు రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.లక్ష - రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈ లకు రూ.1.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

అలాగే బైకుల బీమా, మరమ్మతులకు సంబంధించి వేలకు పైగా క్లెయిమ్లు వచ్చాయన్నారు. అందులో ద్విచక్ర వాహనదారులు రూ.71 కోట్ల మేర క్లెయిమ్ చేశామన్నారు. అందుకోసం రూ.6 కోట్లు చెల్లించామన్నారు. మరో 6 వేల క్లెయిమ్ లు పెండింగ్ ఉన్నాయని వాటికి సంబంధించి ప్రతి ద్విచక్రవాహనదారునికి రూ.3 వేలు, ఆటోలకు రూ.10 వేలు ఆర్థికసాయం అందిస్తామన్నారు. అలాగే చేనేత కార్మికులకు రూ.15 వేలు, మగ్గం కోల్పోయిన చేనేతలకు రూ.25 వేలు సాయం చేస్తామన్నారు. మత్స్యకారు లకు సంబంధించి బోట్లకు నెట్ దెబ్బతిని పాక్షికంగా ధ్వంస మైతే రూ. 9 వేలు, పూర్తిగా ధ్వంసమైతే రూ.20 వేలు వంతున సాయాన్ని ప్రకటించారు.

Tags

Next Story