AP : ఆరు పాలసీలు.. 20లక్షల ఉద్యోగాలు.. విజన్ ప్రకటించిన చంద్రబాబు

AP : ఆరు పాలసీలు.. 20లక్షల ఉద్యోగాలు.. విజన్ ప్రకటించిన చంద్రబాబు
X

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. థింక్‌ గ్లోబల్లీ, యాక్ట్‌ గ్లోబల్లీ నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు. ఒకేసారి ఆరు కొత్త పాలసీలు తీసుకొచ్చామని తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌, క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ ఎనర్జీ పాలసీలు తీసుకొచ్చామన్నారు పర్యాటక, ఐటీ, వర్చువల్‌ వర్కింగ్‌ పాలసీలు తీసుకువస్తామని చెప్పారు. వన్‌ ఫ్యామిలీ- వన్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ నినాదంతో వెళ్తున్నామని తెలిపారు. కొత్త పాలసీలు రాష్ట్ర ప్రగతిని మారుస్తాయన్నారు సీఎం.

Tags

Next Story