HBD Chandrababu: ప్రజాసేవకు పునరంకితం అవుతూ రాజీలేని పోరాటం చేస్తా - చంద్రబాబు

HBD Chandrababu: ప్రజాసేవకు పునరంకితం అవుతూ రాజీలేని పోరాటం చేస్తా - చంద్రబాబు
HBD Chandrababu: ప్రజాసేవకు పునరంకితం అవుతూ రాజీలేని పోరాటం చేస్తానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

HBD Chandrababu: ప్రజాసేవకు పునరంకితం అవుతూ రాజీలేని పోరాటం చేస్తానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పుట్టిన రోజు సందర్భంగా ఆయన బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రజాపక్షాన రాజీలేని పోరాటం కొనసాగించేందుకు.. తనకు శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. తెలుగుజాతికి పూర్వవైభవం రావాలని దుర్గమ్మను కోరుకున్నానని తెలిపారు.

ఊరూ వాడా చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నాయి.. కేక్ లు కట్ చేసి సంబరాలు చేసుకున్నాయి.. తెలుగు వారికి చంద్రబాబు అంటే ఒక భరోసా అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. పుట్టినరోజు సందర్భంగా నాన్నకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్ల మందికి అన్నదాత అయ్యారన్నారు.

లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యమని పేర్కొన్నారు. సొంత కుటుంబం కాకుండా.. తెలుగు జాతినే కుటుంబం చేసుకున్నారన్నారు. ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే తన సూపర్‌ స్టార్‌ అంటూ ట్వీట్‌ చేశారు లోకేష్‌. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా విశాఖలోని పార్టీ కార్యాలయంలో నేతలు కేక్‌ కట్‌ చేశారు. రాష్ట్రానికి దశ దిశ చూపగలిగే నాయకుడు చంద్రబాబేనన్నారు నాయకులు.

ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక.. సిక్కోలు జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు, రక్తదానాలు చేశాయి. అటు.. కాకినాడ టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. భావితరాల భవిష్యత్‌ కోసం ఆలిచించే ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబేనన్నారు టీడీపీ పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌ జ్యోతుల నవీన్‌.

చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఏలూరులో కార్యకర్తలు భారీ కేక్ కట్‌ చేశారు. ఫైర్ స్టేషన్ సెంటర్‌లో జరిగిన వేడుకల్లో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో పాటు ఏలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ బడేటి చంటి పొల్గొన్నారు. బాబు బర్త్‌డే కేక్‌ను విద్యార్థులకు, బాటసారులకు పంచారు. ప్రపంచ దేశాల్లోనూ గుర్తింపు కలిగిన నేత చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యే ముప్పి వెంకటేశ్వరరావు అన్నారు.

గోపాలపురం దేవరపల్లి బస్టాండ్‌ వద్ద జరిగిన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. టంగుటూరులో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అటు.. పొదిలిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాయి టీడీపీ శ్రేణులు. అనంతరం పెద్దబస్టాండ్‌ సెంటర్‌లో కేక్‌ కట్‌ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కడప జిల్లా రైల్వేకోడూరులో పార్టీ ఇన్‌ఛార్జ్‌ విశ్వనాధనాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచారు. హైద‌రాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భ‌వ‌న్‌లో చంద్రబాబు జ‌న్మదిన వేడుకల‌ను ఘ‌నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు రక్తదానం చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని కులీకుతుబ్ షా తర్వాత చంద్రబాబు అభివృద్ధి చేశారని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు బ‌క్కని న‌ర్సింహులు అన్నారు.

అటు కూకట్‌పల్లిలోనూ వేడుకలు ఘనంగా నిర్వహించారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఈ వేడుకల్లో నందమూరి సుహాసిని పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. చంద్రబాబుకు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఐటీడీపీ కార్యకర్తలు. తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వద్దకు వెళ్లి ఆన్‌లైన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. నాటి అభివృద్ధి - నేటి అరాచకం మధ్య తేడాను ప్రజలు గమనించాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story