కరోనాను నియంత్రణ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ : చంద్రబాబు

కరోనాను నియంత్రణ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ : చంద్రబాబు
ఇసుక దొంగ వ్యాపారమే వైసీపీ కార్యకర్తలకు దినచర్యగా మారిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సత్యవేడు రోడ్‌ షోలో పాల్గొన్న చంద్రబాబు..

ఇసుక దొంగ వ్యాపారమే వైసీపీ కార్యకర్తలకు దినచర్యగా మారిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సత్యవేడు రోడ్‌ షోలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. కరోనా రోగులకు వైద్య చికిత్స అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన చంద్రబాబు.. కరోనాను నియంత్రణ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ అని మండిపడ్డారు.

ముగ్గురు టీడీపీ ఎంపీలు మూడు సింహాల్లా పోరాటం చేస్తున్నారని.. కేంద్రాన్ని ప్రశ్నిస్తే జైలుకు వెళతానని జగన్‌కు భయం పట్టుకుందన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో 90 పరిశ్రమలను తీసుకొచ్చి..వేలాది మంది యువతకు ఉపాధిని కల్పించామని.. ఐతే జగన్‌ను చూసి పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు చంద్రబాబు. నమ్ముకున్న వాళ్ళను సీఎం పిడిగుద్దులు గుద్దుతున్నాడని.. మోటార్లకు మీటర్లు రైతుల మెడలకు ఉరితాడులా మారాయని అన్నారు.

Tags

Next Story