Chandrababu: ప్రకాశం జిల్లా రైతులను సన్మానించిన చంద్రబాబు.. బెదిరింపులను లెక్కచేయకుండా..

X
Chandrababu: మహానాడు నిర్వాహణకు భూములిచ్చిన ప్రకాశం జిల్లా మండువారిపాలెం రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు ఘనంగా సన్మానించారు. 40 మంది రైతులను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి ఆహ్వానించి సత్కరించారు. బెదిరింపులను లెక్క చేయకుండా మహానాడు కోసం 140 ఎకరాల పొలాలను ఇవ్వడాన్ని అభినందించారు. తామ భూములను మహానాడు కోసం ఇవ్వడం గర్వంగా ఉందని రైతులు అన్నారు. మహానాడుతో తమ ఊరి పేరు దేశ విదేశాల్లో మార్మోగుతుందన్నారు. తమ పొలాలను సర్వే చేయించి మరీ యథాతధంగా ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
