ఆర్టీసీ టికెట్లపై జెరూసలేం యాత్ర విశేషాల ప్రింటింగ్‌ దేనికి సంకేతం : చంద్రబాబు ప్రశ్న

ఆర్టీసీ టికెట్లపై జెరూసలేం యాత్ర విశేషాల ప్రింటింగ్‌ దేనికి సంకేతం : చంద్రబాబు ప్రశ్న

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిని ఎన్ని విధాలుగా అప్రదిష్టపాలు చేయాలో అన్ని విధాలుగా చేశారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అసభ్యప్రవర్తనతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ రాజీనామా చేయడం, భక్తులకు పోర్న్‌ వెబ్‌సైట్‌ లింకులు పంపడం టీటీడీ చరిత్రలో ఎప్పుడైనా జరిగాయా అని ప్రశ్నించారు. తిరుపతిలో అన్యమత ప్రచారం, ఆర్టీసీ టికెట్లపై జెరూసలేం యాత్ర విశేషాల ప్రింటింగ్‌ దేనికి సంకేతమని ప్రశ్నించారు చంద్రబాబు.

టీడీపీ హయంలో తిరుపతి నగరానికి అనేక అవార్డులు వచ్చాయని, సురక్షిత నగరంగా.. ప్రశాంత నగరంగా, పరిశుభ్ర నగరంగా అవార్డులు తెచ్చామన్నారు. ఇప్పుడు వైసీపీ వచ్చాక అంతా నాశనం చేశారంటూ చంద్రబాబు మండిపడ్డారు.. తిరుపతి పార్లమెంటు పరిధిలో రైతు ఆత్మహత్యలు పెరగడంతోపాటు, దళితులపై దాడులకు అంతే లేకుండా పోయిందన్నారు. వైసీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మంత్రులు ఎమ్మెల్యేల అరాచకాలను ఎండగట్టాలన్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించాలని, ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story