CM Chandrababu : పింఛన్ల పంపిణీపై చంద్రబాబు శుభవార్త

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్‌కు సంబంధించిన హామీని నెరవేర్చేందుకు మరో ముందడుగు వేసింది. ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి తీసుకునే వెసులుబాటు కల్పించనుంది ప్రభుత్వం. వరుసగా రెండు నెలలు తీసుకోలేకపోతే.. ఆ తర్వాత నెలలో మూడు నెలలకు కలిపి మొత్తం 12వేలు అందివచనుంది. ఈ హామీ అమలుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో డిసెంబరు నుంచే పాత విధానాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నవంబర్‌లో పింఛన్ అందుకోలేనివారు డిసెంబరు 1న రెండు నెలలది కలిపి ఇస్తారు. నవంబరులో దాదాపు 45 వేల మంది వివిధ కారణాలతో పింఛను తీసుకోలేదని సమాచారం. వీరికి వచ్చే నెల అంటే డిసెంబర్ 1న అందజేస్తారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఈ విధానం అమలైంది. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ దీన్ని రద్దుచేసి ఏ నెలకు ఆ నెలే పింఛను తీసుకోవాలనే నిబంధన తీసుకొచ్చారు. దీంతో పింఛన్‌లు తీసుకునేవారు ఇబ్బందిపడ్డారు. దీంతో కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com