AP : బోట్లను కొయ్యడంలో చంద్రబాబు సర్కారు తిప్పలు.. ప్లాన్ త్రీ కూడా ఫెయిల్

వరద నీటిలో కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ కష్టతరంగా మారింది. పడవల కట్టింగ్ ప్రక్రియలో విశాఖపట్నం స్కూబా టీమ్ 95 శాతం పనులను పూర్తి చేసినా.. పడవల్లో. చలనం రాలేదు. ఈ స్థితిలో గతంలో గోదావరిలో కచ్చులూరు వద్ద జరిగిన టూరిస్ట్ షిప్పును వెలికి తీసిన అనుభవం ఉన్న రాజమండ్రి అబ్బులు టీమ్ శుక్రవారం రంగంలోకి దిగింది.
బలమైన గొలుసులతో ఈ బోట్లను ఒడ్డుకు చేర్చేందుకు ఈబృందాలు ప్రయత్నిస్తున్నాయి. శుక్రవారం సాయం త్రానికి బోట్లు ఒడ్డుకు చేరుతాయని ఇంజనీర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకూ బోట్లు కదలలేదు. వాస్తవానికి ఈ బోట్లను తొలగించటానికి ఇంజనీరింగ్ అధికారులు ప్లాన్ ఏ, ప్లాన్ బీ.. ఇలా ప్లాన్ ల మీద ప్లాన్ లు డిజైన్ చేస్తున్నారు. కానీ ప్లాన్ లు ఫ ఇవ్వటం లేదు.
గడిచిన మూడు రోజులుగా ఈ బోర్డు తొలగించేందుకు అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. మొదటి రోజు భారీ క్రేన్ల సహాయంతో బోల్తా కొట్టిన పడవలను యధాస్థితికి తీసుకువచ్చి బ్యారేజీ దిగువకు నెట్టేందుకు ప్రయత్నించారు. గంటల తరబడి ప్రయత్నించినప్పటికీ పని సాగలేదు. మరో ప్లాన్ లో భాగంగా రెండవ రోజు బోట్లను రెండుగా కట్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఇంజనీర్లు సహాయంతో గ్యాస్ కట్టర్లతో బోట్లను రెండు భాగాలుగా విడగొట్టేందుకు సుమారు 12 అడుగుల లోతులోకి వెళ్లి ప్రయత్నించారు. 95 శాతం కటింగ్ పూర్తయింది. కానీ నదీ గర్భంలో భారీ ఇనుప గడ్డలు కారణంగా పడవల కటింగ్ కు అంతరాయం కలిగింది.
చివరి ప్రయత్నంగా భారీ పడవల సహాయంతో ఈ బోట్లను తొలగించే ప్రయత్నాలను శుక్రవారం ప్రారంభించారు. 14 సభ్యుల ఈ బృందం ఏడు భారీ బోట్లతో పడవల తొలగింపును ప్రారంభించారు. మూడవ రోజూ ఈ బోట్ ఆపరేషన్ కష్టంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com