కరోనాపై ప్రజల్లో ధైర్యం నింపేందుకు చంద్రబాబు ఆన్‌లైన్‌ సమావేశం

కరోనాపై ప్రజల్లో ధైర్యం నింపేందుకు చంద్రబాబు ఆన్‌లైన్‌ సమావేశం

కరోనా వైరస్‌ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.. కరోనాపై ప్రజల్లో ధైర్యం నింపేందుకు ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. వైద్య నిపుణులు, కోవిడ్ బాధిత కుటుంబాలు, కరోనాను జయించిన వారితో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 4,125 మంది కరోనా కారణంగా చనిపోవడం బాధాకరమన్నారు. వైరస్‌ను నియంత్రించలేక వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో సదుపాయాలు దారుణంగా ఉన్నాయని.. మొదట్నుంచి ప్రభుత్వం వైరస్‌ను తేలిక చేసి మాట్లాడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చంద్రబాబు అన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు నివాళులర్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు.
Tags

Read MoreRead Less
Next Story