అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై బైండోవర్ కేసులు పెట్టడంపై చంద్రబాబు ఆగ్రహం

అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై బైండోవర్ కేసులు పెట్టడంపై చంద్రబాబు ఆగ్రహం
chandrababu Naidu ; అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై బైండోవర్ కేసులు పెట్టడాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

chandrababu Naidu : అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై బైండోవర్ కేసులు పెట్టడాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు చెప్పినట్టు వ్యవహరిస్తే పోలీసులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కోటబొమ్మాళి పోలీసులు.... హరివరప్రసాద్, సురేష్, కృష్ణమూర్తిపై పెట్టిన రౌడీషీట్ వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. అధికారం ఉంది కదా అని అరాచకంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించక తప్పదన్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గినా.. ఏపీలో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు తగ్గడం లేదని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాజ్యాంగం, చట్టం అడుగడుగునా దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. అక్రమ కేసులకు, రౌడీ షీట్లకు భయపడే నాయకులు టీడీపీలో లేరని, రాజారెడ్డి రాజ్యాంగానికి మరో 3 ఏళ్లే వ్యాలిడిటీ అని చంద్రబాబు అన్నారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు హరివరప్రసాద్, ప్రసాద్‌ కుమారుడు కింజరాపు సురేష్, అనుచరుడు కింజరాపు కృష్ణమూర్తిపై నిన్న రౌడీషీట్‌ తెరిచారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన వీరిని పలు కేసుల్లో ముద్దాయిలుగా గుర్తించి బైండోవర్‌ చేసినప్పటికీ.. వాటన్నింటినీ ఉల్లంఘించడంతో ఇప్పుడు రౌడీషీట్‌ తెరిచినట్లు టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య, కోటబొమ్మాళి ఎస్‌ఐ రవికుమార్‌లు తెలిపారు. రౌడీషీట్‌ తెరిచేందుకు పలు సందర్భాల్లో నమోదైన కేసుల్ని ప్రస్తావించారు. 2008లో నిమ్మాడలో పింఛన్ల పంపిణీ సందర్భంగా తలెత్తిన వివాదం, 2010లో నిమ్మాడకు చెందిన మెండ పోతయ్య అనే వ్యక్తిపై జరిగిన దాడి కేసు, 2020లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిమ్మాడలో విపక్ష అభ్యర్థుల్ని బెదిరించడంతోపాటు 2021లో ఓ హత్యాయత్నం కేసు వీరిపై ఉన్నాయని తెలిపారు. శాంతిభద్రతలకు వీరు విఘాతం కలిగించకుండా ఉండేందుకే రౌడీషీట్‌ నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఐతే.. ఈ కేసులన్నీ తమపై అక్రమంగా పెట్టినవేనని అచ్చెన్న కుటుంబ సభ్యులు అంటున్నారు. కావాలనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమపై రౌడీ షీట్ తెరిచారంటన్నారు.

Tags

Read MoreRead Less
Next Story