Andhra News: సీఈవోకు చంద్రబాబు లేఖ

Andhra News: సీఈవోకు చంద్రబాబు లేఖ
అవకతవకలపై చర్యలు తీసుకోవాలని వినతి

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైకాపానే ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని..తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లేఖ రాసిన చంద్రబాబు ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగడం లేదని వివరించారు. మాన్యువల్ ప్రకారం జనాభాపరమైన సారూప్య ఎంపికలు, ఫోటోగ్రాపిక్ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాల్సి ఉండగా ఇంకా డబుల్ ఎంట్రీలు ఉన్నాయని తెలిపారు. ఇంటింటి సర్వేలో బూత్ లెవల్ ఆఫీసర్లు గుర్తించిన మరణాల సమాచారం, ఏపీ డేటా బేస్ లోని... బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రార్ సమాచారం మేరకు EROమరణించిన వారి ఓట్లు తొలగించాల్సి ఉన్నప్పటికీ.... అలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు.

రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాల్సి ఉండగా........... ఆ దిశలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు తన లేఖలో వివరించారు. అర్హత లేని వారికి.. ఫామ్-6 ద్వారా ఆన్ లైన్ లో ఇష్టానుసారం ఓట్లు నమోదు చేస్తున్నారని..... ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని వివరించారు. ఓటరు జాబితా ముసాయిదాను ప్రకటించి నెల గడుస్తున్నప్పటికీ......... అభ్యంతరాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న చంద్రబాబు.... తుది జాబితానాటికి అన్నీ సరిచేయాలని కోరారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960 ప్రకారం ఓట్లను ఇంటి నెంబర్ల ప్రకారం ఉండేలా చూడాలని, కానీ నేటీకీ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా ఇష్టానుసారంగా ప్రతిపక్షాల ఓట్లు తొలగిస్తున్నారని ఈసీ దృష్టికి తెచ్చారు. ఓటుపై అభ్యంతరాలు లేవనెత్తి ఓట్లను తొలగించాలని కోరుతున్న వారు కచ్చితంగా ఆధారాలు చూపించాలన్నారు. అయితే, కొన్ని నియోజకవర్గాల్లో ఎలాంటి విచారణ చేయకుండానే తెల్ల పేపర్ పై పేర్లు రాసిస్తే ఓట్లను తొలగిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ఓట్ల మార్పులు, చేర్పులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక రివిజన్ సమ్మరీ సందర్భంగా చాలా స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకటించి నెల రోజులవుతున్నా తమ అభ్యంతరాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. వీటన్నింటిపైనా దృష్టి సారించాలని, ఓట్లలో అవకతవకలు లేకుండా చూడాలని చంద్రబాబు సీఈవోను లేఖలో కోరారు.

Tags

Next Story