మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి సేవల్ని స్మరించుకున్న చంద్రబాబు, లోకేశ్

మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగా వారి సేవల్ని స్మరించుకున్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. వారి చిత్రపటాలకు పూలమాల వేసి అంజలి ఘటించారు. చంద్రబాబుతోపాటు లోకేష్ కూడా నివాళులు అర్పించారు. మానవాళి చరిత్రలో ఒక సమున్నత శిఖరం గాంధీజీ అన్నారు. ఆయన నమ్మి ఆచరించి చూపిన సిద్ధాంతాలు కాలానికి అతీతమైనవి అన్నారు. ఐతే.. ఈరోజు దళితులపై జరుగుతున్న దాడుల్లో ఏపీ దేశంలోనే ముందు ఉండడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలంటే స్వార్థం లేకుండా ప్రజాసేవలో తరించడం అనడానికి లాల్‌బహదూర్‌శాస్త్రి నిదర్శనం అన్నారు చంద్రబాబు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా జై కిసాన్ నినాదంతో రైతు హక్కుల్ని కాపాడేందుకు నడుం కడదామని పిలుపిచ్చారు. భారత దేశానికి రెండో ప్రధానిగా గ్రీన్ రివల్యూషన్, వైట్ రివల్యూషన్‌లకు బాటలు సేసిన దార్శనికుడు లాల్ బహదూర్‌శాస్త్రి అని కొనియాడారు లోకేష్. ఆ మహనీయుని స్ఫూర్తిగా రైతు సంక్షేమం కోసం నైతిక విలువలతో కూడిన రాజకీయాల కోసం కృషి చేద్దామని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com