టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు: చంద్రబాబు

టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు: చంద్రబాబు
Chandrababu: టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని.. చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు

Chandrababu: టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని.. చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ అవినీతి నంచి దృష్టి మళ్లించేందుకే తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించిన చంద్రబాబు.. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.

సంగం డెయిరీ ఛైర్మన్‌, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. గుంటూరు జిల్లా, చింతపూడిలోని ధూళిపాళ్ల నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ధూళిపాళ్లతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.. అక్రమ కేసులకు భయపడొద్దని, దీనిపై న్యాయపోరాటం చేద్దామని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు చంద్రబాబు.

రాష్ట్రప్రభుత్వ తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. నరేంద్ర కొన్ని దశాబ్దాలుగా పొన్నూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు సేవచేశారన్నారు. ఇలాంటి పరిస్థితులు తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్న చంద్రబాబు.. విలువలు లేని కక్షపూరిత రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ధూళిపాళ్ల నరేంద్రకు ప్రజలు కూడా అండగా నిలవాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.

వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చట్టాన్ని ఉల్లంఘించి పనిచేసే వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.

తమను పరామర్శించడానికి అధినేతే స్వయంగా రావడం పట్ల ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. చంద్రబాబు తమ కుటుంబాన్ని అండగా ఉండి ఓ తండ్రిలా ధైర్యాన్ని ఇచ్చారని ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులు అన్నారు.

అటు ధూళిపాళ్లను పరామర్శించేందుకు గుంటూరు జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బుడంపాడు జాతీయ రహదారి వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చంద్రబాబుకు పూలతో స్వాగతం పలికారు. జై చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. చింతలపూడి వరకు చంద్రబాబు కాన్వాయ్‌ వెంటే సాగాయి పార్టీ శ్రేణులు. అనంతరం ఇటీవల మరణించిన మైనార్టీ నేత, మాజీ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ హిదాయత్‌ కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించారు. రాజకీయాలను నిజాయితీగా చేయడం వల్ల ఆయనకు సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బారిన పడి మరణించడం బాధాకరమన్నారు. హఙదాయత్‌ కుటుంబాన్ని పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని చంద్రబాబు చెప్పారు.

Tags

Next Story