CM Chandrababu : 1, 2 అంతస్తుల్లో ఉన్నవారికి కూడా చంద్రబాబు ఆర్థిక సహాయం

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 17న వరద ముంపునకు గురైన బాధితులకు పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరముందని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి బాధితుడికి ప్రభుత్వ సాయం అందాలన్నారు. సహాయ చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, పరిహారం అంశంలో న్యాయంగా ఆలోచన చేసి ఇవ్వాలన్నారు. ప్రతి వరద బాధితుడికీ సాయం అందాలన్నారు చంద్రబాబు. ఒకటి, రెండు అంతస్తుల్లో ఉన్నవారు కూడా బాధితులేనని వారికీ పరిహారం అందాల్సిందేననీ బాబు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com