Chandrababu Naidu : ఏపీలో సోషల్ మీడియా బ్యాన్.. చంద్రబాబు అద్భుత నిర్ణయం..

Chandrababu Naidu : ఏపీలో సోషల్ మీడియా బ్యాన్.. చంద్రబాబు అద్భుత నిర్ణయం..
X

ఏపీ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను 90 రోజుల్లోపు తీసుకొస్తామని ప్రకటించారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో.. వారి మానసిక స్థితి ఎలా తయారవుతుందో క్లుప్తంగా వివరించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పింది అక్షరాల నిజం. నేటి జనరేషన్ లో సోషల్ మీడియా వల్ల పిల్లలు చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుతున్నారు. చిన్నవయసులోనే అత్యంత క్రూయల్ గా తయారవుతున్నారు. చిన్న వయసులోనే ఆన్ లైన్ ప్రేమలకు ఆకర్షితులవుతున్నారు. ఇన్ స్టా ప్రేమల వల్ల ఎంతమంది బలైపోతున్నారో చూస్తున్నాం. రీసెంట్ గా ఇన్ స్టాలో పరిచయం అయిన వ్యక్తి కోసం కన్నతల్లినే ఓ బాలిక చంపిన ఘటన అత్యంత దారుణం. ఇవే కాకుండా ఇలా ఎన్నో దారుణమైన ఆన్ లైన్ కేసులు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఆన్లైన్ వేధింపులకు కూడా అమ్మాయిలు బలైపోతున్నారు.

ఇక చిన్న పిల్లలు అయితే ఫోన్ లేనిదే అన్నం కూడా తినట్లేదు. ఆటలు ఆడటం మర్చిపోయారు. సోషల్ మీడియాలో రీల్స్ చేయడంలోనే మునిగిపోతున్నారు. చదువులు కూడా వదిలేస్తున్నారు. పైగా తల్లిదండ్రుల మాట అస్సలు వినట్లేదు. మనుషులతో మాట్లాడటం పూర్తిగా తగ్గించేసి.. ఫోన్ లోనే మునిగిపోతున్నారు. వాళ్లు మానసికంగా డిస్టర్బ్ అయి క్రూరంగా తయారవుతున్నారు. వాళ్లని గట్టిగా మందలిస్తే ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడట్లేదు. వాళ్ల ప్రవర్తన అలా తయారవుతోంది సోషల్ మీడియా వల్ల.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన సీఎం చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్.. ఈ విధమైన మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కర్ణాటకలో కూడా సోషల్ మీడియాపై నిషేధం ఉంది. అలాగే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, మలేషియా లాంటి దేశాల్లో చిన్న పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అలాంటి మంచి నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా ఇలాంటి చట్టాలు తీసుకురావాలంటూ ఇప్పుడు డిమాండ్లు పెరుగుతున్నాయి.

Tags

Next Story