Chandrababu Naidu : వైసీపీది పిచ్చి పాలన.. ఇంత అప్రతిష్టపాలైన ప్రభుత్వం ప్రపంచంలోనే లేదు..!

Chandrababu Naidu : వైసీపీది పిచ్చి పాలనని.. రెండేళ్లలో ఇంత అప్రతిష్టపాలైన ప్రభుత్వం ప్రపంచంలోనే లేదని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కనిగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడి సమక్షంలో.. ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. చిన్నప్పుడు చదువుకున్న పిచ్చి తుగ్లక్‌ను ఇప్పుడు జగన్ రూపంలో చూస్తున్నానన్న చంద్రబాబు ..
విధ్వంసం, అవినీతి, పిచ్చిపాలన ఇలా జగన్ గురించి చెప్పాలంటే అనేకమున్నాయని తెలిపారు. రాష్ట్రం ఎటుపోతోందో అని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఆఫ్గానిస్తాన్ నుంచి నేరుగా డ్రగ్స్ తాడేపల్లికి వచ్చేసిందన్నారు. ఇక NIA విచారణ ప్రారంభించక ముందే డ్రగ్స్‌తో రాష్ట్రానికి సంబంధం లేదని కొందరు సర్టిఫై చేస్తున్నాయన్నారు. మరోవైపు ఆదాయానికి మించి అప్పులు చేసి రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వ నాశనం చేశారన్నారు.
చేసిన అప్పులు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి తప్ప.. ప్రజలకు వెళ్లలేదని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి జరగరాని నష్టం జరిగిందని.. రిపేర్ చేయాలంటే చాలా సమయం పడుతుందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com