Chandrababu : ఏపీలో దొంగల రాజ్యం నడుస్తోంది : చంద్రబాబు

Chandrababu Naidu : కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని రీతిలో స్వాగతం లభించింది.. టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు అధినేతకు ఎదురెళ్లి స్వాగతం పలికారు.. శాంతిపురం మండలం కర్నాటక సరిహద్దు గ్రామం బెల్లాకోగల చేరుకున్న చంద్రబాబుపై పూల వర్షం కురిపించారు.. హారతులతో ఘనంగా స్వాగతం పలికారు మహిళా కార్యకర్తలు.. అనంతరం ర్యాలీగా గ్రామానికి వెళ్లారు.. ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు.. అనంతరం బెల్లాకోగల గ్రామంలో నడుచుకుంటూ వెళ్లి ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.. వర్షాలకు కూలిన ఇళ్లను పరిశీలించారు.. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. ఆ తర్వాత అనికెర క్రాస్ రోడ్స్‌లో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడారు.. వెంకటపల్లి గ్రామంలోనూ రోడ్ షో నిర్వహించారు.
శాంతిపురం మండలం అనికెర క్రాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు చంద్రబాబు.. ఈ ప్రభుత్వం వచ్చాక బాదుళ్లతో ప్రజలపై మోయలేని భారం వేశారని మండిపడ్డారు.. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు.. రాష్ట్రంలో దొంగల రాజ్యం నడుస్తోందని, ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అరాచకానికి తెరలేపారంటూ ఫైరయ్యారు.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు చంద్రబాబు.. కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారంటూ ధ్వజమెత్తారు.. రెస్కో కుప్పానికి తీసుకొస్తే దాన్ని విలీనం చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోందని ఫైరయ్యారు.
ఈ రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేయడానికి ఎంతో సమయం పట్టదని.. ఈ ప్రభుత్వ విధానాలపై ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.. సంక్షేమం సంక్షేమం అని గొప్పులు చెబుతున్న ఈ ప్రభుత్వం ఏ సంక్షేమం ఇచ్చిందో చెప్పాలని నిలదీశారు.. రోడ్లపై తట్టెడు మట్టి వేశారా.. మూడేళ్లలో ఏం పీకారంటూ ఫైరయ్యారు.నారాయణ అరెస్టుపైనా చంద్రబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.. కొడుకు వర్ధంతి చేయడానికి వస్తే నారాయణను అరెస్టు చేశారంటూ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.. పోలీసులు ఆధారాలు లేకుండానే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.. చివరకు తనమీదా కేసు పెట్టారంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు చంద్రబాబు.. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ వేశారని కేసు పెట్టారని.. లేని రింగ్ రోడ్డుకు లాభం ఎలా వస్తుందో చెప్పాలంటూ నిలదీశారు. ప్రజల కోసం కేసులు పెట్టించుకోవడంలో అయినా వెనకడుగు వేయనన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com