Chandrababu: దేశ రాజకీయాల్లో ఇంతటి అక్రమార్జునుడిని చూడలేదు: చంద్రబాబు

Chandrababu:   దేశ రాజకీయాల్లో ఇంతటి అక్రమార్జునుడిని చూడలేదు: చంద్రబాబు
X
ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కి జగన్ మైండ్‌ బ్లాంక్ చేయాలన్న టిడిపి అధ్యక్షులు

సీఎం జగన్‌కు ఎన్నికల్లో ఓటమి కళ్లముందే కనిపిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అందుకే మానసిక ఆందోళనతో ఉన్నారని చెప్పుకొచ్చారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ‘రా.. కదలిరా’ సభలో పాల్గొన్న ఆయన...రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌ సిక్స్‌తో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం.

జగన్‌ను నమ్ముకుంటే వాలంటీర్లు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ‘రా.. కదలిరా’ సభలో పాల్గొన్న ఆయన...రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే సహించబోమన్నారు. తెదేపా వస్తే వాలంటీర్ల ఉద్యోగాలు తీసేస్తామనే అసత్య ప్రచారం చేస్తున్నారని అందులో నిజం లేదన్నారు. ప్రజలకు సేవ చేసే వారికి సహకరిస్తామని స్పష్టం చేశారు.దేశంలోనే నిరుద్యోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్న చంద్రబాబు జగన్‌ జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని గనులన్నింటినీ పెద్దిరెడ్డి ముఠా దోచేస్తుందన్న చంద్రబాబు...అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నింటినీ కక్కిస్తామని హెచ్చరించారు. జగన్ ఎర్రచందనం స్మగ్లర్లను తయారు చేశారని చంద్రబాబు విమర్శించారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులను చంపేస్తున్నా సర్కారుకు చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు..

సొంత చెల్లెల్ని కూడా జగన్ ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఆమెను ఇబ్బందులు పెడుతూ పరువును రోడ్డుకీడ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ సిద్ధం పేరుతో పెట్టిన కటౌట్లు చూసిన ప్రతిసారీ ఆయన చేసిన అవినీతి, అరాచకం గుర్తుకు రావాలని చంద్రబాబు అన్నారు. బటన్‌ నొక్కి ఆయన్ను ఇంటికి పంపించేందుకు ప్రతి ఒక్క ఓటరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.సూపర్‌ సిక్స్‌ ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే తన లక్ష్యమన్న చంద్రబాబు...ప్రతి ఒక్కరూ తెలుగుదేశం-జనసేనకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

Tags

Next Story