Chandrababu Naidu : సినీపరిశ్రమ పెద్ద ఆస్తిని కోల్పోయింది : చంద్రబాబు

Chandrababu Naidu : అమరావతి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో గేయ రచయిత సిరివెన్నెలకు నివాళులు అర్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. సిరివెన్నెల రచనలు ఉత్తేజాన్ని ఇచ్చేవిగా ఉంటాయన్నారు చంద్రబాబు. పార్టీకి పాటలు రాయించే సమయంలో ఆయనతో అనుబంధం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల మృతితో సినీ పరిశ్రమం పెద్ద ఆస్తిని కోల్పోయిందని అన్నారు. తెలుగు సినీ చరిత్రలో ఆయన రాసిన పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
అద్భుత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దాదాపు 3000లకు పైగా పాటలు రాసి సంగీత ప్రియులను అలరించిన పద్మశ్రీ సీతారామశాస్త్రి గారి మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటు.(1/2) pic.twitter.com/JoN3A5jbeR
— N Chandrababu Naidu (@ncbn) November 30, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com