ఆంధ్రప్రదేశ్

Chandrababu : రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలి : చంద్రబాబు

Chandrababu : వినుకొండ రైతు నరేంద్రను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

Chandrababu (tv5news.in)
X

Chandrababu (tv5news.in)

Chandrababu : వినుకొండ రైతు నరేంద్రను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. మద్దతు ధర అడిగినందుకు రైతును జైల్లో పెట్టి.. మొత్తం రైతు వర్గాన్నే అవమానపరిచారంటూ జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పండగపూట అన్నదాత కుటుంబాన్ని క్షోభ పెడితే రైతులోకం క్షమించబోదని మండిపడ్డారు. వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే రైతు నరేంద్రపై తప్పుడు కేసులు పెట్టినట్టు నిర్దారణ అయిందన్నారు. ఇప్పటికే తప్పుడు కేసులు పెట్టిన వినుకొండ రూరల్‌ సీఐ సస్పెండ్‌ అయ్యారని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని వెంటనే నరేంద్రను విడుదల చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

Next Story

RELATED STORIES