Chandrababu : టీడీపీ కార్యకర్తలని కొట్టిన పోలీసులకు శిక్ష పడే దాకా వదలము : చంద్రబాబు

Chandrababu : మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో టీడీపీ కమిటీ సమావేశం వేదికగా పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. టీడీపీ కార్యకర్తల్ని కొట్టిన పోలీసులకు ఇదే చివరి రోజు కావాలన్నారు.. ఇప్పటికే తప్పు చేస్తున్న పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టడం మొదలు పెట్టామన్నారు.. న్యాయం జరగడానికి సమయం పట్టొచ్చుగానీ, తప్పు చేసిన పోలీసుల్ని శిక్షించకుండా వదలబోమని స్పష్టం చేశారు.
శాంతి భద్రతల్ని చేతుల్లోకి తీసుకుని మనల్ని భయపెట్టాలని చూసే వారికి ఖబడ్దార్ చెప్పాల్సిందేనన్నారు. రాజకీయ ముసుగులో వచ్చే కరుడు గట్టిన నేరస్థులకు గట్టి గుణపాఠం చెప్తామన్నారు.. పోలీసులపై మనకు ఎలాంటి వ్యక్తిగత పోరాటం లేదని, అధికార పార్టీ నేతల ఒత్తిడికి లొంగి అపహాస్యం చేసే కొందరు పోలీసులపైనే మన పోరాటమని టీడీపీ శ్రేణులతో చెప్పారు చంద్రబాబు.
రాష్ట్రాన్ని జగన్ అప్పుల పాలు చేశారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఒక్కొక్క కుటుంబంపైనా ఈ మూడేళ్లలో మూడు లక్షల 25 వేల రూపాయలు అదనపు భారం మోపారని అన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచేశారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని... విపరీతంగా ఇష్టం వచ్చినట్లు పన్నులు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదవాడు ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితి లేదన్నారు. అన్న క్యాంటిన్లను ధ్వంసం చేశారని... చివరి అన్నదానం చేసేవారిపైనా దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com