Chandrababu Naidu : ఉత్తరాంధ్రకు మరో గుడ్ న్యూస్.. చంద్రబాబు చిత్తశుద్ధి..!

Chandrababu Naidu : ఉత్తరాంధ్రకు మరో గుడ్ న్యూస్.. చంద్రబాబు చిత్తశుద్ధి..!
X

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల ప్రాజెక్టులను అత్యంత వేగంగా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్నే మార్చే పనిలో సీఎం చంద్రబాబు నాయుడు నిమగ్నం అయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే భోగాపురం ఎయిర్ పోర్టుకు ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. అది త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు సౌత్ కోస్టల్ రైల్వే జోన్ లో కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా ఈ రైల్వేజోన్ ఏర్పాటు కోసం ఎప్పటి నుంచోప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ రైల్వేశాఖ మంత్రితో పలుమార్లు భేటీ కూడా అయ్యారు. కేంద్ర పెద్దలతో మాట్లాడి ఈ రైల్వే జోన్ కోసం ప్రత్యేకంగా ఆర్డర్లు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.

ఇందులో భాగంగానే విశాఖ రైల్వేజోన్ ఉద్యోగుల కేటాయింపు కొలిక్కి వచ్చింది. 959 మంది ఉద్యోగులను ఈ రైల్వేజోన్ లో పనిచేసేందుకు కేటాయిస్తూ నిర్ణయించారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాత్సవ, సౌత్ కోస్టల్ రైల్వే జీఎం సందీప్ మాధుర్ భేటీ అయి ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో ఎవరెవరు పనిచేయాలనే వాటిపై వివరాలు కూడా వెల్లడిస్తారు. దీంతో ఈ రైల్వే జోన్ కు అతిపెద్ద సమస్య క్లియర్ అయిపోయినట్టే అంటున్నారు అధికారులు.

అతి త్వరలోనే ఈ రైల్వేజోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర రైల్వే ప్రయాణంలో కీలక ముందడుగు వేయబోతోంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ కూటమి ప్రభుత్వం అన్ని రకాల ప్రాజెక్టులను ఏపీలో కంప్లీట్ చేస్తోంది. భోగాపురం పూర్తి చేస్తే క్రెడిట్ తీసుకోడానికి కుట్రలు చేసిన వైసీపీ.. రేపు ఈ రైల్వే జోన్ విషయంలోనూ అలాంటి పని చేయడానికి ఇప్పటి నుంచే ప్లాన్లు రెడీ చేసుకుంటుందేమో అంటున్నారు కూటమి నేతలు.


Tags

Next Story