పంచాయితీ ఎన్నికలతో వైసీపీ పతనం ఖాయం : చంద్రబాబు
పంచాయితీ ఎన్నికల మొదటి, రెండు దశల టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.. పంచాయతీ ఎన్నికలతో వైసీపీ పతనం ఖాయమన్నారు. వైసీపీ తీసుకున్న గోతిలో వారే పడతారన్నారు. శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో వైసీపీ దౌర్జన్యకాండ రాష్ట్రమంతా చూసిందన్నారు.. హింస, విధ్వంసాలతో ప్రజలంతా విసిగిపోయారని, వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నాలుగు కీలక దశల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నామినేషన్లు, స్క్రూటినీ, ఉపసంహరణ, కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏకగ్రీవాలపై వైసీపీ ఆశలు నీరుగారాయన్నారు.. బెదిరించి, ప్రలోభపెట్టి ఏకగ్రీవాలు చేసుకోవాలనుకున్న వైసీపీ కుట్రలు నెరవేరలేదన్నారు. ప్రజలంతా టీడీపీ వెంటే ఉన్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు చంద్రబాబు. తప్పుడు పనులతో ప్రజల్లో వైసీపీ భయోత్పాతం సృష్టించిందన్నారు చంద్రబాబు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, స్క్రూటినీలో అప్రమత్తంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.
వైసీపీ నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలకు పాల్పడితే సహించేది లేదన్నారు చంద్రబాబు. గుజరాత్‌లోనూ ఆన్ లైన్ నామినేషన్లకు అనుమతించారని, ఏపిలో తొలిదశకు ముందే మనం అనేకసార్లు అడిగామని గుర్తు చేశారు.. ఓటమి భయంతోనే వైసిపి ప్రభుత్వం ఆన్ లైన్ నామినేషన్లను అనుమతించలేదని చంద్రబాబు దుయ్యబట్టారు.. తర్వాత దశల్లోనైనా ఆన్ లైన్ నామినేషన్లకు అనుమతించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com