CRDA: సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అయిన అమరావతిలో అత్యాధునిక హంగులతో నూతన సీఆర్డీఏ కార్యాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం. 9.54 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి నారాయణలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రాయపూడి సమీపంలోని సీడ్ ఆక్సిస్ రోడ్ వద్ద నిర్మించిన ఈ కార్యాలయం మొత్తం 3,07,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జి+7 అంతస్తులతో రూపుదిద్దుకుంది. ఇందులో రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్, బ్యాంకు, AI కమాండ్ సెంటర్, సమావేశ మందిరాలు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, CRDA, ADCL విభాగాలు మరియు ఉన్నతాధికారుల ఛాంబర్లు ఏర్పాటు చేశారు.
ఆరంభోత్సవంతో అమరావతిలో పనులు మరింత ఊపందుకోనున్నాయి. రాయపూడి ప్రాంతంలో 3.62 ఎకరాల్లో నిర్మితమైన ఈ 7 అంతస్తుల భవనం, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌తో పాటు అధునాతన సౌకర్యాలతో అమరావతి అభివృద్ధికి కేంద్ర హబ్‌గా మారనుంది. రాయపూడి ప్రాంతంలో 3.62 ఎకరాల స్థలంలో నిర్మితమైన ఈ భవనం, మొత్తం 2.42 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. భవనం G+7 రూపంలో ఉంది. ప్రతి అంతస్తులో అధికారుల కెబిన్‌లు, ఉద్యోగుల వర్క్స్టేషన్లు, కామన్ ఫెసిలిటీలు అలాగే విస్తృత ఇంటీరియర్ డిజైన్‌తో ప్రణాళికాబద్ధంగా నిర్మించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com