Chandrababu Naidu : మహిళలకు పెద్దపీట వేస్తున్న చంద్రబాబు..

Chandrababu Naidu : మహిళలకు పెద్దపీట వేస్తున్న చంద్రబాబు..
X

సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి పార్టీలో చాలానే మార్పులు చేస్తున్నారు. పార్టీ తాత్కాలిక అవసరాలను కాకుండా భవిష్యత్తులో గట్టి పునాదులు పడేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర కమిటీని, జిల్లా కమిటీలను వేయాలని ఇప్పటికి నిర్ణయించారు. అయితే జిల్లా కమిటీల్లో ఈసారి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మహిళలకు 33% రిజర్వేషన్ ఉన్న తరుణంలో పార్టీలో కూడా అదే స్థాయిలో వారికి రిజర్వేషన్ అమలు అయ్యేలా చేయాలంటున్నారు చంద్రబాబు. మహిళలను నామినేటెడ్ పదవుల వరకే పరిమితం చేయకూడదని పార్టీలో వారిని చురుకుగా పాల్గొనేలా చేయాలన్నది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. అందులో భాగంగానే జిల్లా కమిటీల కోసం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండుసార్లు చర్చలు జరిపారు.

మంత్రులు, కీలక నేతలను జిల్లాల్లోకి వెళ్లి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు. కానీ వారు ఆ స్థాయిలో నివేదిక ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇప్పుడు మరోసారి నివేదిక తెప్పించుకుంటున్నారు. నాలుగు రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని.. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఉంటాయని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ప్రతి జిల్లా కమిటీలు 40 మంది ఉంటే అందులో కచ్చితంగా 9 మంది మహిళలు ఉండాల్సిందే అంటున్నారు టిడిపి అధినేత. మహిళలు క్రియాశీలకంగా ఉన్నచోట అధ్యక్ష పదవులు కూడా ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.

కార్యకర్తల అభిప్రాయాన్ని బట్టి మహిళలకే పెద్దపీట వేయబోతున్నారు. టిడిపి పార్టీలో సీనియర్లు, జూనియర్ లు అని చూడకుండా పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు ఇస్తామని చంద్రబాబు, లోకేష్ పదే పదే ప్రకటిస్తున్నారు. ఇప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ మహిళలకు పదవులు వరించబోతున్నాయి. 2019 నుంచి 24 మధ్యలో పార్టీ కోసం కష్టపడ్డ మహిళలకే ఈ పదవులు రాబోతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు నిర్ణయం పై టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పార్టీలో అందరికీ సమన్యాయం జరుగుతుందని చెబుతున్నారు.

Tags

Next Story