Chandrababu : నేడు బెజవాడకి చంద్రబాబు.. పుట్టినరోజు సందర్భంగా దుర్గమ్మ దర్శనం..!

Chandrababu :  నేడు బెజవాడకి చంద్రబాబు.. పుట్టినరోజు సందర్భంగా దుర్గమ్మ దర్శనం..!
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఉదయం 9 గంటలకు బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు అందుబాటులో ఉంటారు. అధినేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు పార్టీ ఆఫీసుకు పెద్ద సంఖ్యలో చేరుకోనున్నారు కార్యకర్తలు. మధ్యాహ్నం వరకు పార్టీ నేతలతో గడిపి.. సాయంత్రం నాలుగు గంటలకు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ముందుగా అడవినెక్కలం మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామానికి వెళ్తారు. ప్రజల సమస్యలను నేరుగా వారి వద్దకే వెళ్లి తెలుసుకోనున్నారు. ఈ రాత్రికి గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story