మూడు ప్రాంతాల అభివృద్ధి.. చంద్రబాబు సూపర్ విజన్

ఏపీలో మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త విజన్ తీసుకొస్తున్నారు. అదే రీజనల్ డెవలప్మెంట్ జోన్స్. మూడు ప్రాంతాలను మూడు రీజినల్స్ గా డివైడ్ చేశారు. విశాఖ కేంద్రంగా విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలను కలిపి ఒక రీజినల్ జోన్ గా తీసుకొచ్చారు. మొన్న గ్లోబల్ సమ్మిట్ లోనే దీన్ని ప్రకటించారు. నీతి అయోగ్ దీన్ని రూపొందించింది. ఈ జిల్లాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఇంటర్నేషనల్ కంపెనీలు, గూగుల్ డేటా సెంటర్, క్వాంటం, టిసిఎస్ తోపాటు మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు విశాఖకు వస్తున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో ఇప్పటికి అనేక మౌలిక సదుపాయాలు కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నారు.
లక్ష్మీ మిట్టల్ స్టీల్ ప్లాంట్ లాంటివి, భోగాపురం ఎయిర్ పోర్ట్, శ్రీకాకుళంకు మరో ఎయిర్ పోర్టుతో పాటు మరిన్ని వస్తున్నాయి. ఇటు అమరావతి కేంద్రంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలను కలిపి అమరావతి రీజనల్ ఎకానమీగా మార్చారు. దీన్ని సింగపూర్ సంస్థలు, నీతి అయోగ్ కలిపి డెవలప్ చేస్తున్నాయి. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాను కలిపి తిరుపతి రీజినల్ జోన్ గా డిసైడ్ చేశారు. దీన్ని త్వరలోనే నీతి అయోగ్ ప్రకటించబోతోంది. రాయలసీమ జిల్లాలకు పారిశ్రామిక కేంద్రాలు ఇప్పటికే చాలానే వస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ కృషితో వస్తువులను ఉత్పత్తి చేసే అనేక కంపెనీలు రాయలసీమలోనే ఉన్నాయి.
అమరావతి కేంద్రంగా ఉన్న రీజనల్ కు ఇప్పటికే ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చేస్తున్నాయి. జాతీయ స్థాయి సంస్థలు కూడా ఇక్కడ కేంద్రీకృతం అవుతున్నాయి. అటు పోర్టులు, ఇటు జాతీయ రహదారులు, హైదరాబాద్, బెంగుళూరు ను కలుపుతూ నేషనల్ హైవేలు ఉండటం అమరావతికి ప్లస్ అవుతుంది. రాయలసీమ జిల్లాలకు ఇప్పటికే జలవనరులను తీసుకొస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇలా మూడు ప్రాంతాలను ఒకే స్థాయిలో అభివృద్ధి చేయటానికి కూటమి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. దీన్ని నిన్న చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు.
చంద్రబాబు నాయుడు విజన్ 2047 అమల్లోకి వస్తే కనుక ఏపీ సమగ్ర అభివృద్ధి జరగటం ఖాయం. చాలా రాష్ట్రాల్లో ఒకే రాజధానిని అభివృద్ధి చేయటం వల్ల మిగతా జిల్లాలకు అన్యాయం జరిగింది. కానీ ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి ఉండదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఏపీకి దాదాపు అన్ని జిల్లాలకు పోర్టులు ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. కాబట్టి ఉన్న వనరులను అద్భుతంగా వినియోగించుకుంటూ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి సీఎం చంద్రబాబు నాయుడు ఇంతగా కృషి చేస్తున్నారు. ఆయన విజన్ అమల్లోకి వస్తే ఏపీకి తిరిగే ఉండదు.
Tags
- Chandrababu Naidu
- Vision 2047
- Andhra Pradesh development
- Regional Development Zones
- Vizag regional zone
- Amaravati regional economy
- Tirupati regional zone
- NITI Aayog plan
- AP infrastructure
- global summit AP
- Google data center Vizag
- Bhogapuram airport
- Lakshmi Mittal steel plant
- international investments
- CBN development model
- AP industrial growth
- Rayalaseema industries
- Amaravati growth corridor
- AP masterplan
- AP future development
- Latest Telugu News
- TV5 News
- Andhra Pradesh News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

