తిరుప‌తి బైపోల్స్‌.. టీడీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక

తిరుప‌తి బైపోల్స్‌.. టీడీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక
మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నాయకుల క్షేత్రస్థాయి పనితీరుకు అద్దం పడుతాయన్నారు చంద్రబాబు.

తిరుప‌తి బైపోల్స్ కు టీడీపీ సిద్దం అవుతుంది. మంగ‌ళ‌గిరి లోని పార్టీకేంద్ర కార్యాల‌యంలో చంద్రబాబు ఉప ఎన్నిక‌పై సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ని ముఖ్యనేత‌లు, తిరుప‌తి ఇంచార్జ్ లు ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు. అంద‌రితో సుధీర్ఘంగా చ‌ర్చించిన చంద్రబాబు...అనంతరం త‌రువాత నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష జ‌రిపారు. ఎన్నిక‌ల్లో పోటీపై స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకున్నారు. నేత‌ల‌కు దిశా నిర్థేశం చేశారు.

పార్టీ నేత‌ల అభిప్రాయ‌లు తీసుకున్న చంద్రబాబు.. మ‌రోవైపు నేత‌లకు హెచ్చరిక‌లు ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఇక ఎటువంటి ఎన్నిక‌లు ఉండ‌వ‌ని.. వీటిని సీరియ‌స్ గా తీసుకోవాలని అధినేత సూచించారు. ఎన్నిక‌ల్లో ఇంచార్జ్ లు గ‌ట్టిగా పని చెయ్యక‌పోతే చ‌ర్యలు ఉంటాయ‌ని ప‌రోక్షంగా హెచ్చరించారు. రానున్న ఎన్నిక‌ల్లో సీట్లు ఇవ్వాల‌న్నా.. ఇంచార్జ్ లుగా కొన‌సాగాల‌న్నా ఇవే కొల‌మానమంటూ నేత‌ల‌కు సూచించారు. క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెప్తే కుదరదని హెచ్చరించారు. వైసీపీ వైఫల్యాలపై పది ముఖ్యమైన అంశాలు గుర్తించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. విధేయతలు, మొహమాటాలు ఇకపై చెల్లవని చంద్రబాబు తేల్చి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నాయకుల క్షేత్రస్థాయి పనితీరుకు అద్దం పడుతాయన్నారు చంద్రబాబు.

తిరుపతిని మొత్తం 70 క్లష్టర్లుగా విభ‌జించారు. ఒక్కో క్లస్టర్ కు 30 బూత్లు ఉంటాయి. వీటిని సీనియ‌ర్ నేత‌ల‌ను ఇంచార్జ్ లుగా నియ‌మిస్తున్నారు. 20వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించాల‌ని చంద్రబాబు సూచించారు. తాను కూడా ప్రచారానికి వ‌స్తాన‌ని తెలిపారు. సందర్భంగా..ఇక..ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేసే యోచనలో ఉన్నానని తిరుపతి ఉపఎన్నిక టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ చంద్రబాబుకు తెలిపారు. మొత్తం ఎన్నిక‌ల‌ను ప్రక్రియ‌ను స‌మ‌న్వయ ప‌ర‌చ‌డానికి 5గురు నేత‌ల‌తో క‌మిటీ ఏర్పాటు చేశారు. అచ్చంనాయుడు, సోమిరెడ్డి, లోకేష్, బీద ర‌విచంద్ర‌తో పాటు.. ప‌న‌బాక కృష్ణయ్య ఈ క‌మిటీలో ఉంటారు.


Tags

Next Story