చంద్రబాబు ఢిల్లీ టూర్ గ్రాండ్ సక్సెస్.. నిధులపై చర్చలు.

సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఏపీకి కేంద్ర నిధులతో పాటు ఇతర ప్రాజెక్టుల పర్మిషన్లు, కీలక రహదారుల విషయంలో కేంద్ర మంత్రులను కలిసి చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత ముందుచూపుతో ప్రతిపాదించిన నివేదికలను కేంద్ర మంత్రులు సైతం ప్రశంసించారు. అమరావతి తో పాటు పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన కేంద్ర నిధుల విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి సీఎం చంద్రబాబు విన్నవించారు. ఏపీకి కేంద్ర నిధుల అవసరాలతో పాటు.. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను వివరించారు. కేంద్రం సహాయముంటే మరింత వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.
అలాగే అమరావతికి చట్టబద్ధత విషయంలో హోమ్ మినిస్టర్ అమిత్ షాను కలిసి చర్చించారు సీఎం చంద్రబాబు. ఏపీకి రాజధాని ఎంత అవసరమనేది ఈ చర్చలో వివరించారు. ప్రస్తుతం అమరావతికి వస్తున్న ప్రపంచ స్థాయి పెట్టుబడులతో పాటు ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు, పనుల్లో వేగం.. అమరావతి అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు నాయుడు కూలంకుశంగా వివరించారు. చంద్రబాబు నాయుడు విజ్ఞప్తిపై అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించారు. అమరావతికి చట్టబద్ధత విషయంలో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్.
అలాగే కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి అమరావతి నుంచి కనెక్ట్ చేసిన మూడు ప్రధాన జాతీయ రహదారుల విషయంలో కూడా చర్చించారు. ఈ విషయంలో కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వానికి కేంద్రం సపోర్టు ఉంటే అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు వివరించారు. ఇలా తన ఢిల్లీ టూర్ లో ముఖ్య నేతలను కలిసి ఏపీ గురించి కీలక ప్రతిపాదనలు చేసి తన టూర్ గ్రాండ్ సక్సెస్ చేసుకున్నారు.
Tags
- Chandrababu Naidu
- AP CM Delhi Tour
- Amaravati Capital
- Polavaram Project
- Nirmala Sitharaman
- Amit Shah
- Ashwini Vaishnaw
- Central Funds for AP
- Andhra Pradesh Development
- Amaravati Legal Status
- AP Infrastructure Projects
- National Highways AP
- TDP Government
- AP Political News
- Delhi Meetings Update
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
