Kandukur Issue: కందుకూరు ఘటన.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం..

Kandukur Issue: కందుకూరు ఘటన.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం..
Kandukur Issue: కందుకూరు ఘటనపై పార్టీ సీనియర్లతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Kandukur Issue: కందుకూరు ఘటనపై పార్టీ సీనియర్లతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరుపున 15లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక నేతలంతా కూడా తమ వంతుగా ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. మొత్తంగా మృతుల కుటుంబాలకు 20లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు. పోలీసుల వైఫల్యమే ఘటనకు కారణమని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబుతో చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు వేలాది మంది పోలీసులతో..భద్రత కల్పిస్తున్నారని టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన నేతలు...టీడీపీ సభలకు భారీగా ప్రజలు వస్తున్న భద్రత కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇక కాసేపట్లో బాధిత కుటుంబాల గ్రామాలకు టీడీపీ అధినేత వెళ్లనున్నారు. మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు నివాళులు అర్పించనున్నారు చంద్రబాబు. కందుకూరు ఘటనలో 8మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. ఇప్పటికే గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్లకు చంద్రబాబు సూచించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని.. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని చంద్రబాబు భరోసా కల్పించారు.

కందుకూరు ఘటనలో మృతి చెందిన ఎనిమిది మంది మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తి అయ్యింది. ఇక కందుకూరు ఏరియా ఆస్పత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నారనే సమాచారంతో అధికారుల హడావుడి చేశారు. మృతదేహాలను వెంటనే తీసుకుని వెళ్లాలని కుటుంబ సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 15 నిమిషాల్లోనే మృతదేహాల తరలించారు.


ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సభ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. టీడీపీ అధినేతను చూడాలన్న అభిమానంతో ఒక్కసారిగా జనం ముందుకు వచ్చారు. చంద్రబాబు పదే పదే వారించిన తమ అభిమాన నేత వద్దకు వెళ్లాలనే ఉత్సాహంతో వెనక్కి తగ్గలేదు. ఇదే వారి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యింది.



ఘటనపై చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అమాయకులు చనిపోవడం కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు 10లక్షల ఆర్థిక సాయంతో పాటు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కందుకూరు ఘటనలో ఇవాళ అక్కడ జరగాల్సిన కార్యక్రమాలన్నింటని చంద్రబాబు రద్దు చేసుకున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప‌్రగాఢ సానుభూతి తెలిపారు.

మరోవైపు ఘటన జరిగిన ప్రదేశంలో బాధితుల, కార్యకర్తలు చెప్పులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఊహించిన దానికంటే రెండు మూడు రెట్లు జనం అధికంగా రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Tags

Next Story