Skill Development Case: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 15కి వాయిదా

Skill Development Case:  చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 15కి వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 15కు వాయిదాపడింది.ఈ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగ్గా ప్రభుత్వం తరపు నుంచి అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి విచారణకు హాజరు కాలేకపోతున్నారని సీఐడీ ప్రత్యేక పీపీ వివేకానంద కోర్టుకు తెలిపారు. ఈనెల 22కు విచారణ వాయిదా వేయాలని కోర్టును అభ్యర్ధించారు. ఈ అభ్యర్ధనను తోసిపుచ్చిన కోర్టు ఈనెల 15కు వాయిదావేసింది. మరోసారి సమయం పొడిగించేది లేదని కోర్టు తేల్చిచెప్పింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మధ్యంతర బెయిలుపై చంద్రబాబు ఇటీవల విడుదలయ్యారు

Tags

Read MoreRead Less
Next Story