రేణిగుంట ఎయిర్‌పోర్టులో నేలపై కూర్చొని చంద్రబాబు నిరసన

రేణిగుంట ఎయిర్‌పోర్టులో నేలపై కూర్చొని చంద్రబాబు నిరసన
నన్ను ఎయిర్‌పోర్టులో ఎందుకు నిర్బందించారో చెప్పండి : చంద్రబాబు

* తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలోనే చంద్రబాబు నిరసన

*విమానాశ్రయంలో నేలపై కూర్చొని చంద్రబాబు నిరసన

* పోలీసుల వైఖరిపై చంద్రబాబు మండిపాటు

* 14 ఏళ్లు సీఎంగా పనిచేశా.. నేను ప్రతిపక్ష నేతను : చంద్రబాబు

* నన్ను ఎయిర్‌పోర్టులో ఎందుకు నిర్బందించారో చెప్పండి : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయంలో... దాదాపు రెండు గంటలుగా ఉండిపోయారు. చంద్రాబబును లాంజ్‌నుంచి బయటికు వెళ్లేందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆయన అప్పటినుంచి ఎయిర్‌పోర్టులో ఉన్నారు. కోవిడ్‌ నిబంధనల్లో భాగంగా పర్యటనకు అనుమతి లేదంటూ చంద్రబాబు అడ్డుకున్నారు పోలీసులు. ఈ మేరకు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే అదుపులో తీసుకుంటామంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదన్న పోలీసులు.. ఆయన బయటకి రాకుండా భారీగా పోలీసులను మోహరించారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో అవకతవకల్ని నిరసిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు, తిరుపతిలో వైసీపీనేతల అక్రమాలను నిరసిస్తూ గాంధీ విగ్రహాల వద్ద శాంతియుత ధర్నాకు పిలుపునిచ్చారు. స్వయంగా ఆయనే పాల్గొనాలని నిర్ణయించారు. అయితే.. ఈ ధర్నాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పలువురు టీడీపీ నేతల్ని అరెస్ట్‌ చేశారు. మరికొందరిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో టీడీపీ నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు. దీంతో పాటు టీడీపీ నేతల ఇళ్ల వద్ద నోటీసులు అంటించారు.

Tags

Read MoreRead Less
Next Story