Chandrababu : నారాయణ అరెస్టు పూర్తిగా కక్షపూరితం : చంద్రబాబు

Chandrababu :  నారాయణ అరెస్టు పూర్తిగా కక్షపూరితం : చంద్రబాబు
Chandrababu : మాజీ మంత్రి నారాయణ అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

Chandrababu : మాజీ మంత్రి నారాయణ అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణ అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. మాస్ కాపీయింగ్ కు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు...నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా...విచారణ చెయ్యకుండా... అధారాలు లేకుండా నేరుగా అరెస్టు చెయ్యడం కక్ష పూరిత చర్య కాదా అని చంద్రబాబు నిలదీశారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నారాయణను జైల్లో పెట్టేందుకు అక్రమ కేసులతో జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story