AP : చంద్రబాబు పాలనలో సీమకు అన్యాయం.. తులసీ రెడ్డి ఆందోళన

AP : చంద్రబాబు పాలనలో సీమకు అన్యాయం.. తులసీ రెడ్డి ఆందోళన
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వంపై ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు ఐదు నెలల పాలనలో రాయలసీమకు పది అన్యాయాలు, మోసాలు, ద్రోహాలు జరిగాయన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమలను అమరావతికి తరలించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఒకవైపు అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ మరొక వైపు పూర్తి కేంద్రీకరణ వైపు పయనించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాయలసీమలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

Tags

Next Story