జగన్ పాలనలో వరి సాగు తగ్గిపోయింది: చంద్రబాబు

సైకో జగన్ పాలనను ప్రజలు వదిలించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇంతవరకు వైసీపీ పాలకులు తన మంచితనాన్నే చూశారన్న చంద్రబాబు.. భవిష్యత్తులో తన కఠినత్వం ఎలా ఉంటుందో వారికి రుచి చూపిస్తానన్నారు. ఏపీని దేశంలో అగ్రస్థానంలో ఉంచాలని తాను ప్రయత్నిస్తే.. జగన్ మాత్రం రాష్ట్రాన్ని చివరి స్థానంలో నిలబెట్టాడని మండిపడ్డారు. సైకో పాలనలో వెళ్లిపోయిన కంపెనీలను.. టీడీపీ అధికారంలోకి రాగానే తిరిగి తీసుకువస్తానన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందులలో సైకో ఓడిపోతుoడటమే దేవుడు తిరగరాసిన స్క్రిప్ట్ అంటూ చంద్రబాబు చెప్పారు.
ప్రాజెక్ట్ బాటలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు సందర్శించారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటికి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే గిద్దలూరుకు వద్దామనుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో అన్నీ ఉన్నా జగన్మోహన్ రెడ్డి శనిలా దాపురించాడని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గిపోయిందని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల్ని ఆదుకుని ఉంటే వరి విస్తీర్ణం తగ్గేది కాదన్నారు. తాను తిడుతున్నానని ఇప్పుడు వరద బాధితుల పరామర్శకు జగన్ వెళ్తున్నారని చెప్పారు. జగన్ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ...సైకో టైమ్ అయిపోయిందంటూ విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com