AP : ఏపీ సీఎంగా రేపు చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీ సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు ( Chandrababu ) కుటుంబసమేతంగా తిరుమలకు వెళ్లనున్నారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, బాలకృష్ణ తదితరులు రాత్రికి అక్కడే బస చేసి 13న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఎన్నికల్లో ఘన విజయం తర్వాత చంద్రబాబు తొలిసారి తిరుమలకు రానుండటంతో స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఈ నెల 12న ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారట. ఇప్పటికే ప్రభుత్వం నుంచి చెర్రీకి ఆహ్వానం కూడా వెళ్లిందట. విజయవాడ కేసరపల్లి IT పార్క్ సమీపంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. దీంతో చంద్రబాబు, చెర్రీ ఫొటోలను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఇవాళ ఉదయం 10 గంటలకు టీడీఎల్పీ సమావేశం జరగనుంది. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును పార్టీ నేతలు ఎన్నుకోనున్నారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్‌తోపాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. తర్వాత వీరంతా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. చంద్రబాబును తమ నేతగా ఎన్నుకున్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com