పూలే స్ఫూర్తితో టీడీపీ.. బీసీల అభ్యున్నతికి పాటుపడుతోంది : చంద్రబాబు

పూలే స్ఫూర్తితో టీడీపీ.. బీసీల అభ్యున్నతికి పాటుపడుతోంది : చంద్రబాబు
జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావుపూలే కృషిచేశారని గుర్తు చేశారు.

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావుపూలే కృషిచేశారని గుర్తు చేశారు. వర్ణ, కుల, లింగ వివక్షపై పోరాడి ప్రజలను చైతన్యపరిచారని అన్నారు.. పూలే స్ఫూర్తితో టీడీపీ బీసీల అభ్యున్నతికి పాటుపడుతోందన్నారు.. జ్యోతిరావు పూలే సామాజిక, దేశ సేవలను స్మరించుకుందామని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.. భారత్‌ ప్రజాస్వామిక దేశంగా రూపుదాల్చడానికి ముందే సామాజిక ప్రజాస్వామ్యం నెలకొల్పడానికి కృషిచేసిన దార్శనికుడు పూలే అని కొనియాడారు. నాటి సమాజంలో అణచివేతకు గురవుతున్న మహిళలు, బడుగులలో చైతన్యాన్ని నింపి వారితో ముందడుగు వేయించిన ప్రగతిశీలి అన్నారు.

కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలనే అవకాశవాదులకు, కుల అహంకార పెద్దలకు జ్ఞానోదయం కలిగేలా పూలే ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు లోకేష్‌.. అదే ఆ మహానుభావుడికి మనం అందించగలిగే అసలైన నివాళి అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story