ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా?

ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా?
సంక్షేమ పథకాల్లో ఆంక్షల పేరుతో కోతలు పెట్టడంపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలంటూ ట్వీట్‌ చేశారు

జగన్‌ సర్కార్‌పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబు ఫైర్ అయ్యారు. సంక్షేమ పథకాల్లో ఆంక్షల పేరుతో కోతలు పెట్టడంపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలంటూ ట్వీట్‌ చేశారు. మచిలీపట్నంకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు సీమ పర్వీన్ పెన్షన్‌ తొలగింపుపై సీరియస్‌ అయ్యారు. ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా?..18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రులు చేతులపై పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? పెన్షన్ కు నాడు అర్హురాలు, నేడు అనర్హురాలు ఎలా అయ్యిందని ప్రశ్నించారు. 90శాతం వైకల్యం ఉన్న అమెకు నిబంధనల పేరుతో..పెన్షన్ తొలగించడమే మీ మానవత్వమా? అంటూ ట్వీట్‌ చేశారు చంద్రబాబు.


Tags

Read MoreRead Less
Next Story