పులివెందులలో దళిత మహిళపై హత్యచారం ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ

పులివెందులలో దళిత మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. మేకలు మేపడానికి వెళ్లిన మహిళపై అత్యాచారం చేసి.. హత్యకు పాల్పడటం అత్యంత దారుణమని అన్నారు. ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారని తెలిపారు. అధికార వైసీపీ నేతల అండతో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై దాడులు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు. సీఎం సొంత నియోజకర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. అత్యాచార నిందితుల్ని వైసీపీ నేతలు రక్షించాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పడంతోనే.. వరుస ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టాలు రూపొందించి.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల దినోత్సవం రోజైనా బాధితులకు భరోసా ఇవ్వాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com